అదనపు రుణ సౌకర్యంపై అవగాహన

Nov 28,2023 23:44

ప్రజాశక్తి – చీరాల
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఒ కె నేతాజీ అధ్యక్షతన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇల్లు పథకం పురోగతిపై చర్చించారు. మండలంలో 1074మంజూరయ్యాయని అన్నారు. ఈ ఇల్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. పేదల ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునే వారికి ఇంకా అదనపు రుణాన్ని అందజేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకారం ఇస్తుందని అన్నారు. డ్వాక్రా ద్వారా రుణాలను మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కావున ప్రతి సచివాలయ పరిధిలో ఇల్లు నిర్మించుకుంటున్న అర్హులను గుర్తించి వారు అదనపు రుణ సహాయాన్ని పొందేలా సెక్రటరీలు కృషి చేయాలని అన్నారు. హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, ఏపీఎం సుబ్బారావు, ఇఒఆర్డీ బాపూజీ ఉన్నారు.

➡️