ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని1 వార్డుకు చెందిన యద్దనపూడి గోపిరాజుకు అద్దంకి – బల్లికురవ ప్రధాన రహదారి రోడ్డు మార్జిన్‌లో ఇటుక బట్టిల వద్ద మంగళవారం ఒక సంచి దొరకింది. గోపిరాజు ఆ సంచిలో ఏముందో చూద్దామని ఆ సంచిని పరిశీలించాడు. ఆ సంచిలో రూ.లక్ష నగదు, విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించాడు. ఆ బంగారు ఆభరణాలపై ఉన్న అడ్రస్ ఫోన్ నెంబర్లను పరిశీలించాడు. ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ జె పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన యానాదులు దుర్గారావుగా గుర్తించాడు. పోగొట్టుకున్న వ్యక్తుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వారిని పిలిపించి గోపిరాజు నివాసంలో సాయంత్రం పెద్దల సమక్షంలో తనకు దొరికిన సొమ్మును బాధితునికి అందజేశారు. మానవత్వాన్ని, నిజాయితీని చాటుకున్న గోపిరాజు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.