నేటి నుండి ఈనెల 30 వరకు
ప్రజాశక్తి – బాపట్ల
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడా పోటీలు ప్రథమ దశ స్థానిక వ్యవసాయ కళాశాలలో ఈనెల 28 నుండి 30వరకు జరగనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు తెలిపారు. కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో అంతర్, అనుబంధ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. వాలీ బాల్, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, షటిల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, కారమ్స్ పోటీలు నిర్వహిస్తారని అన్నారు. విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆర్ శారదాజయలక్ష్మిదేవి 28న పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభ సభకు అధ్యక్షులుగా డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ పి సాంబశివరావు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల ప్రచార ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం పిడి రవికాంత్‌రెడ్డి, నైరా వ్యవసాయ కళాశాల పిడి ఏ పురుషోత్తం, వ్యవసాయ కళాశాల ఓఎస్ఏ వెంకట శ్రీధర్, టి ప్రశాంత్ కుమార్, ఎం రవిబాబు, డి రమేష్ పాల్గొన్నారు.