డిసెంబర్ 6న అంబేద్కర్ విగ్రహాలకు వినతి
ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 8 నుంచి నిరవధిక సమ్మె.
ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడ్రాజు.
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 8 నుంచి సమ్మె లోకి వెళ్తున్నామని,వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సే యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జగన్మోహన్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పూల్ బాగ్ 2.వ సెక్టార్, బొందుల గూడెం 3వ సెక్టార్ సమావేశాల సందర్భంగా ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడ్రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రావు అంగన్వాడి వర్కర్లను ఉద్దేశించి మాట్లాదారూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో తీవ్ర మొండిగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పి నేడు మాట మార్చారని చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రస్తుత ధరల్లో మెనూ చార్జీలు సరిపోవని, అంగన్వాడి సెంటర్లకు కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుంటే ప్రభుత్వం రూ “200 /-ఇచ్చి సరిపెడుతుందని , 2014 నాటి బకాయిలను సర్ చార్జీలు, సర్దుబాటు చార్జీల భారం మేము ఎలా భరించగలమని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్లో గ్రాట్యూటీ అమలు చేస్తున్నారని, ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. వర్కర్ కు 500000, హెల్పర్ కి మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ కు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం గత నాలుగు సంవత్సరాలుగా శాంతియుత పద్ధతుల్లో పోరాడుతున్నామని ప్రభుత్వం మొండిగా ఉండడంతో డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, డిసెంబర్ 6న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రంలో ఇస్తున్నామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 8 నుంచి 21 సమ్మెకు సిద్ధం కాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు శివలక్ష్మి, సునీత, ప్రసన్న, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.