ప్రజాశక్తి-ఆదోని రూరల్ : మంగళవారం రోజున గడపగడప కార్యక్రమం సందర్భంగా మండలం పరిధిలో గోనబావి గ్రామంలో దళిత కాలనీ నివాసంలో ఉంటున్న మాలలక్ష్మన్న తన ఇంటి వద్ద కొళాయి ఏర్పాటు చేయాలని అడిగినందుకు కులం పేరుతో దూషించి దాడి యత్నం చేసిన సర్పంచ్ మహమ్మద్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది,కెవిపిఎస్ నాయకులు తిక్కప్ప, మాజీ కౌన్సిలర్ బాలాజీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి సమక్షంలో దుర్భాషలాడుతూ ఏం పీక్కుంటావ్ అంటూ నీకు కొళాయి కనెక్షన్ ఇవ్వనని, నీ అంత చూస్తానని బెదిరించడమే కాకుండా కుల వివక్షతో ఒక సర్పంచ్ ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమా ప్రశ్నించారు. గ్రామాల్లో నేటికీ స్వాతంత్రం వచ్చి77 సం.రాలు అయినా నేటికీ కులవక్షత,అంటరానితనం కొనసాగుతుందని వాటిని అరికట్టాలవలసిన ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి దృష్టికి తీసుకువెళ్తామని మాల లక్ష్మన్నకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటూ, పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు మునిస్వామి, ఉసిని, మాల మహానాడు సీనియర్ నాయకులు బసాపురం ఈరన్న, ఆలూరు నాయకులు ఏరిస్వామి పాల్గొన్నారు.