ప్రజాశక్తి-మెరకముడిదాం : ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సోమలింగాపురం గ్రామంలో జెడ్‌పి చైర్మన్, ఎంపి బెల్లాన చంద్రశేఖర్ , జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ నేటి నుంచి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులకు ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేయబడతాయని, గడువు ఇచ్చినప్పటికీ వారం రోజుల లోపే చెల్లింపులు జరుగుతాయని అన్నారు. రైతు పండించిన ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి డిఎం మీనా కుమారి, వ్యవసాయశాఖ జెడి రామారావు , మండల వ్యవసాయాధికారి శ్రావణితేజ, ఎంపిడిఒ ఎం.రత్నం, తహశీల్ధార్ పి. విజయ భాస్కర్, మండల నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్ వి రమణరాజు, కోట్ల వెంకటరావు, పప్పల కృష్ణ, మూర్తి, కెఎస్‌ఆర్‌కె ప్రసాద్, తల చుట్ల హరి బాబు, క్రిష్ణ మూర్తి రాజు, బూర్లె నరేష్ కుమార్ పలువురు పాల్గొన్నారు.