హైకోర్టు న్యాయమూర్తులకు సత్కారం

 ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌  :  జిల్లా వ్యాప్తంగా న్యాయ మూర్తులతో శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన వర్కుషాప్‌నకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా పోర్ట్‌పోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, యు.దుర్గాప్రసాద్‌ను పలువురు న్యాయ వాదులు కలిసి సత్కరించారు. నూతన కోర్టు భవన సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో న్యాయ వాదుల సంఘ కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ దామోదర రావు, విజి సంతోష్‌ ,అంజని కుమార్‌ , సీనియర్‌ న్యాయ వాదులు కెవియన్‌ తమ్మన్న శెట్టి, బొడ్డు సత్య నారాయణ, ఇనుగంటి సురేష్‌, ధవళ వెంకట రావు, బివిఅర్‌కె ప్రసాద్‌, కె.సూర్య ప్రకాష్‌ తదితరులు ఉన్నారు. కోలగట్లకు అభినందనలుశిల్పారామం నుండి కోర్టుకు చేరుకోవడానికి రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేసిన డిప్యూటీ స్పీకర్‌ కోలగట్లను న్యాయవాదులు అభినందించారు.

➡️