హింసకు వ్యతిరేకంగా ర్యాలీ

ప్రజాశక్తి- గంట్యాడ: మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న హింశలకు వ్యతిరేకంగా మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం వైకెపి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. మహిళా మండల కార్యాలయం నుండి కొటారుబిల్లి గ్రామం వరకూ ర్యాలీ చేసి కొటారుబిల్లి కూడలిలో మానవహారం నిర్వహిం చారు. మహిళలకు, చిన్నపిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపైన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం శ్రీనివాసరావు, ఎఫ్‌సిఒ ఎపిఎం సైలెస,్‌ సిసిలు చినబాబు, అచ్చింనా యుడు, ముత్యాల నాయుడు, గౌరీశ్వరి, విఒలు, స్వయం పాల్గొన్నారు. రేగిడి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎపిఎం గోవిందరావు, డిప్యూటీ తహశీల్దార్‌ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం మండల కాంప్లెక్స్‌లో వెలుగు కార్యాలయం నుంచి జెండర్‌ ఆధారిత అహింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే మరణాలు సంభవించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, మండల మహిళా సంఘం, విఒఎలు పాల్గొన్నారు.గుర్ల : డ్వాక్రా సంఘాలు లింగ వివక్షపై అవగాహన కల్పించాలని ఎపిఎం నారాయణరావు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ లింగ వివక్ష పై అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 22 వరకు తింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. నెల రోజుల పాటు స్వయం సహాయక సంఘాలు, కలశాలల్లో అవగాహన కల్పించాలని సూచిం చారు. డెంకాడ: స్థానిక మండల పరిషత్తు కార్యాలయం వద్ద శనివారం లింగ వివక్షకు వ్యతిరేకంగా వైకెపి ఆధ్వర్యంలో మహిళలు, కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ విజయలక్ష్మి, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆర్‌వి.రామమూర్తి, ఎన్‌జిఒ సంస్థ శివ శంకర్‌ పాల్గొన్నారు. భోగాపురం: జెండర్‌ హింసకు వ్యతిరేకంగా భోగాపురం మండల సమైక్య ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి ఉప్పాడ అనూష రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో వైసిపి మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్య నారాయణ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ శివారెడ్డి, వెలుగు ఎపిఎం రమణ, ఎంపి డిఒ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపి సత్యవతి, తహశీల్దార్‌ చింతాడ బంగార్రాజు పాల్గొన్నారు.

 

➡️