సుస్వరం భమిడిపాటి వీణా నాదం

ప్రజాశక్తి-బొబ్బిలి  :  కేంద్ర పర్యాటక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన, ప్రముఖ వీణా విద్వాంసులు భమిడిపాటి కనకదుర్గ ప్రసాద్‌ వీణ కచేరీ ఆద్యంతం శ్రోతలను రంజింప చేసింది. సత్సంప్రదాయ సంగీతానికి అద్దంపడుతూ కనకదుర్గ ప్రసాద్‌ పలు కీర్తనలను వీణపై పలికించిన తీరు ఆహుతుల మన్ననలందుకుంది. బొబ్బిలిలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో జరిగిన ఈ కచేరికి, మృదంగంపై వంకాయల వెంకట రమణమూర్తి, మోర్సింగ్‌ పై గొట్టుముక్కల వెంకటేష్‌ అందించిన సహకారం కచేరీని రక్తి కట్టించింది. జిల్లా పర్యాటక అధికారి లక్ష్మీ నారాయణ, పలువురు ఇతర ప్రముఖులు, సంగీత ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️