సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి

Dec 1,2023 21:54

ప్రజాశక్తి-బొండపల్లి  :  పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపిపి చల్ల చలంనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని అంబటివలసలో సర్పంచ్‌ శిరుపురపు కసవయ్య అధ్యక్షతన రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఇఒపిఆర్‌డి సిహెచ్‌.సుగుణాకరరావు గ్రామంలో లబ్ధిదారులకు అందజేసిన సంక్షేమ వివరాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నంనాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు మహంతి రమణ, ఎంపిడిఒ వైవి.రాజేంద్రప్రసాద్‌, ఎఒ మల్లికార్జునరావు, హౌసింగ్‌ ఎఇ బివి.రామరాజు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ పల్లి రఘు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొల్లు సతీష్‌ కుమార్‌, సర్పంచులు ఈదిబిల్లి కృష్ణ, శిరుపురపు ఆదినారాయణ, బొండపల్లి ఈశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు తాళ్లపూడి అప్పలనాయుడు, బండారు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.డెంకాడ : రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని జొన్నాడలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. వైసిపి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, డెంకాడ మండల కన్వీనర్‌ సారిక గౌరీశంకర్‌, జొన్నాడ సర్పంచ్‌ కోరాడ రమణి కోటినాయుడు, ఎంపిటిసి దేవి మురళి, ఆకులపేట సర్పంచ్‌ సువ్వాడ రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.వేపాడ : మండలంలో నల్లబెల్లి గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిపి డి.సత్యవంతుడు మాట్లాడుతూ మరో ముఖ్యమంత్రి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారని, అందుకే జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంను చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.భోగాపురం : పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని రామచంద్రపేట సచివాలయ పరిధిలో ఆంధ్రకు జగన్‌ ఎందుకు కావాలి అనే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మండలంలోని అనేక గ్రామాలలో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేదల కోసం పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుక్క అప్పన్న, రమణ, నందిగాం సర్పంచ్‌ గరే మురళి, చిన్నారావు, ఎంపిడిఒ అప్పలనాయుడు, ఇఒపిఆర్‌డి సురేష్‌, నాయకులు పాల్గొన్నారు.రేగిడి : పేదల అభ్యున్నతే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని వైస్‌ ఎంపిపిలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహన్‌ రావు అన్నారు. చాటాయవలస గ్రామంలో సర్పంచ్‌ గోవిందరావు అధ్యక్షతన మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.. వీరితోపాటు పిల్లా గోవిందరావు, కిషోర్‌ కుమార్‌, లావేటి అప్పలనాయుడు, సురేష్‌ ఉన్నారు.

➡️