శారద కంపెనీ వద్ద ఆందోళన

Dec 1,2023 20:29

ప్రజాశక్తి-కొత్తవలస  :  స్థానిక కంటకాపల్లి సమీపాన శారద కంపెనీ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. గురువారం కంపెనీలో ప్రమాదవశాత్తు తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు ధర్మరెడ్డి మహేష్‌ బాబు (32) మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మహేష్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. ఉద్యోగులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహేష్‌ కుటుంబానికి రూ.30లక్షలు పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం, మృతుడి భార్యంకు ఉద్యోగం, పెన్షం ఇస్తామని యాజమాన్యం తెలిపింది. అందుకు బాధిత కుటుంబీకులు అంగీకరించలేదు. మహేష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఆందోళన కొనసాగించారు. సిఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️