చీపురుపల్లి: వికలాంగులకు వివిధ రకాలైన పరికరాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ పాల్గొని వివిద అంగవైకల్యం కలిగిన 51 మందికి మోటార్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, చెవిటి మిషన్లు, చేతి కర్రలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులై ఉండి పరికరాలు అందని వారు డిశంబరు 5వ తేదీన కొత్తవలస మండలం మంగళంపల్లిలో గల గురుదేవ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి వెల్లి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వికలాంగులు చెప్పేటప్పుడు ఆదార్ కార్డు, సదరన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇప్పిలి వెంకటనర్శమ్మ, జెడ్పిటిసి వలిరెడ్డి శిరీష, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ఎంపిడిఒ జి గిరిబాల, తహశీల్దారు ఎం సురేష్, ఎఒ తామరాపల్లి ప్రవీణ్, ఇఒపిఆర్‌డి అన్నపూర్ణాదేవి, వైసిపి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, పతివాడ రాజారావు, కోరుకొండ దాలయ్య, చందక గురునాయుడు, ముజికిర్ అహమ్మద్ పాల్గొన్నారు