రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి : పిసిసి

ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి ప్రాంత సమగ్ర అభివద్ధి కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేసిందని, కడప నుంచి పెండ్లిమర్రి వరకు రైలు మార్గం పూర్త యిందని పిసిసి రాష్ట్ర మీడియా చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులను ఇవ్వని కార ణంగా పనులు నిలిచిపోయాయని, ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేసి రైలు మార్గాన్ని త్వరగాపూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. డిసిసి అధ్యక్షులు షేక్‌ అల్లాబకష్‌ ఆధ్వర్యంలో గురు వారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బంగళా సర్కిల్‌ వరకు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ శాంతయ్య, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు కత్వాల్‌ మహమ్మద్‌ రఫీక్‌, రాష్ట్ర కార్యదర్శి లీలా శ్రీనివాస్‌, జిల్లా అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు రెడ్డి సాహెబ్‌, సోమశేఖర్‌ రెడ్డి, రైల్వేకోడూరు బాధ్యులు గోసాల దేవి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్‌ మన్సూర్‌ అలీఖాన్‌, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు చెన్న కష్ణ, జిల్లా మీడియా చైర్మెన్‌ నరేష్‌, ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు మంజునాథతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వాటాగా ఇవ్వవలసిన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు వెంటనే రైల్వే శాఖ ప్రాజెక్టు పనులు ప్రభుత్వం కషి చేయాలన్నారు. లేకుంటే రాయలసీమ ప్రజలు కోపాగ్నికి వైసిపి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు దర్బార్‌ బాష, కోనేశేటి ప్రతాప్‌రెడ్డి, యహియాబాష, ఖాదర్‌ ఖాన్‌, మహ్మద్‌ రఫీ, డాక్టర్‌ అహ్మద్‌బాషా, రమేష్‌, రమణమ్మ, మహాబూబ్‌ జాన్‌, మాజీ కౌన్సిలర్‌ మీనాకుమారి, రిజ్వానా పాల్గొన్నారు.

➡️