గజపతినగరం : స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు శాశ్వత భూహక్కు పథకం ద్వారా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22ఎ జాబితా నుంచి తొలగించి అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు కల్పించినట్లు తెలిపారు. గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాలకు సంబంధించిన 703 ఎకరాలను 1378 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 44 మంది నిరుపేదలను గుర్తించి 28 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. గజపతినగరం మండలంలో శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన 22 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఒ సాయిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.