రామభద్రపురంలో నిషేధిత బిటి-3 పత్తి సాగు

Nov 29,2023 21:32

ప్రజాశక్తి- బొబ్బిలి:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన బిటి-3 పత్తి రామభద్రపురం మండలంలో గప్‌ చుప్‌గా సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు వల్ల పర్యావరణానికి ముప్పు కలగడంతో పాటు సాగు భూములు బీడు భూములుగా మారే అవకాశం ఉండడంతో బిటి-3 పత్తి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు.ఈ పత్తి వల్ల విత్తన మాఫియాకు అధిక లాభాలు రావడంతో రామభద్రపురం మండలంలోని కొన్ని గ్రామాలను విత్తన మాఫియా ఎంపిక చేసుకుని రైతులకు విత్తనాలు, పెట్టుబడి నిధి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు. బిటి-3 పత్తి సాగు చేస్తే తామే అధిక ధరలకు కొనుగోలు చేస్తామని గుంటూరు ప్రాంతానికి చెందిన విత్తన మాఫియా రైతులకు చెప్పడంతో సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. బిటి-3 పత్తి సాగు చేస్తున్నట్లు రామభద్రపురం మండల వ్యవసాయ శాఖాధికారికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రైతులకు నిషేధిత పత్తి విత్తనాలు ఇచ్చి సాగు చేపించి ఆ పత్తిని రైతుల నుంచి విత్తన మాఫియా కొనుగోలు చేసి విత్తనాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిటి-3 పత్తి సాగుతో పర్యావరణానికి హానిబిటి-3 పత్తి సాగు చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ విత్తనాలు నాటిన వెంటనే మొక్కలు రాకముందే కలుపు మందు గ్లైఫోసెట్‌ను పిచికారీ చేయాలి. గ్లైఫోసెట్‌ మందు పిచికారీ చేయడం వల్ల కలుపు మొక్కలు చనిపోతాయి. ఈ గ్లైఫోసెట్‌ మందు వల్ల జన్యు పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల పర్యావరణానికి హానీ జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిటి-3 పత్తి సాగుకు అనుమతులు ఇవ్వలేదు.తగ్గనున్న మదుపులుబిటి-3 పత్తి సాగు వల్ల కలుపు ఖర్చులు తగ్గుతాయని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తిలో రెండుసార్లు కలుపు తీయాలి. కలుపు నివారణకు గ్లైఫోసెట్‌ రసాయనిక మందు పిచికారీ చేస్తే ఎకరానికి రూ. వెయ్యి లోపు ఖర్చవుతుంది. గ్లైఫోసెట్‌ రసాయనిక మందును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించాయి. బిటి-3 పత్తి సాగును రైతులతో చేపించి రైతులతో గ్లైఫోసెట్‌ కొనుగోలు చేయించి విత్తన మాఫియా సొమ్ము చేసుకుంటుంది. 500 ఎకరాల్లో సాగు?రామభద్రపురం మండలంలోని సుమారు 10 గ్రామాల్లోని 500 ఎకరాల్లో బిటి-3 పత్తి సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోటశిర్లాం పంట పొలాలను ప్రజాశక్తి విలేకరి పరిశీలించగా బిటి-3 పత్తి సాగును గుర్తించారు. ఆడ, మగ పత్తిని పక్కపక్కనే ఉన్న పొలాల్లో రైతులు సాగు చేసి మగ పువ్వును తెంచి ఆడ పువ్వుతో క్రాసింగ్‌ చేసి బిటి-3 పత్తి సాగు చేస్తున్నారు. కోట శిర్లాం, పాడివానివలస, కొండకెంగువ తదితర ఏడు గ్రామాల్లో బిటి-3 రకం పత్తి సాగు చేస్తున్నట్లు అక్కడ రైతులు చెపుతున్నారు. ఇదీ రైతులు మోసపోతున్న విధానంముఖ్యంగా రైతులు బిటి-3 (గ్లైసిల్‌) విత్తనాలు ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రధాన కారణం కలుపు మొక్కలు తీసే పని లేకపోవడమే. గడ్డి గ్లైసిల్‌ విత్తనాలు ఉపయోగించడం వల్ల మొక్క ఎదుగుతున్న క్రమంలో పంటలో వస్తున్న కలుపు, గడ్డిని పారద్రోలడానికి కూలీలను పెట్టుకొని కలుపు తీసివేయవలసి పని లేకుండా పోతుంది. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ గ్లైసిల్‌ విత్తనాలు ఉపయోగించేవారు గ్లైఫోసెట్‌ ( నిషేధ గడ్డిమందు)ను ఉపయోగిస్తే గడ్డి మాత్రం చచ్చి పోయి చెట్టుకు ఎలాంటి నష్టం ఉండదు. సాగుకు సహకరిస్తున్న ఎఒ రామభద్రపురం మండల వ్యవసాయ శాఖాధికారి బిటి-3 సాగుకు, విత్తన మాఫీయాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విత్తన మాఫియా నుంచి కొంత మొత్తం తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పత్తి సాగుపై సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.బిటి-3 పత్తి సాగు చేస్తే క్రిమినల్‌ కేసులునిషేధిత బిటి-3 పత్తి సాగు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని వ్యవసాయ శాఖ ఎడి మజ్జి శ్యామసుందర్‌ చెప్పారు. బిటి-3 పత్తి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదన్నారు. రామభద్రపురం మండలంలో సాగు చేస్తున్న విషయం తనకు తెలియదని సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఆరు మేకలు మృతికొన్ని రోజులు క్రితం బిటి-3 పత్తి ఆకులు తిని పాడివానివలస గ్రామం ఒక మేకల కాపరికి చెందిన వే ఆరు మేకలు మృతి చెందినట్లు తెలిసింది. నిషేధిత పత్తి ఆకులు తింటే జీర్ణవ్యవస్థ పాడై జంతువులైనా, పశువులైనా మరణించే అవకాశం ఉంది.

➡️