ప్రజాశక్తి – ఆలమూరు, మామిడికుదురుటిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు, బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తూరు సెంటర్ ఎన్టిఆర్ ఫంక్షన్ హాల్లో టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామి అధ్యక్షతన టిడిపి శ్రేణులతో కలసి శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ, దగాపడ్డ ప్రజలకు అండగా నిలిచిన యువగళం పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. జగన్ రాజకీయ కుట్రల వల్ల పాదయాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిరెడ్డి పెదకాపు, ఈదల సత్తిబాబు, వంటిపల్లి సతీష్, ఈదల నల్లబాబు, రామానుజుల శేషగిరిరావు, సలాది నాగేశ్వరరావు, నాగిరెడ్డి వెంకటరత్నం, ఈదల రమేష్ పాల్గొన్నారు.మామిడికుదురు మండలం పాసర్లపూడిలో టిడిపి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం.శ్రీనివాస్, జాలెం శ్రీనివాసరాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామన రాంబాబు మాట్లాడుతూ అధికార పార్టీ అక్రమ అరెస్టులతో నిలిచిన లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 సోమవారం పున ప్రారంభం అవుతున్న తరుణంలో టిడిపి జనసేన పార్టీల శ్రేణులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డొక్కా నాథ్బాబు, మోకా ఆనంద సాగర్, బోణం బాబు, మద్దాల కృష్ణమూర్తి, డివివి.సత్యనారాయణ, వక్కలంక బుల్లియ్య, బడుగు జోగేష్, బొంతు పెదబాబు, జనసేన నేతలు శిరిగినీడి వెంకటేశ్వరరావు, అడబాల తాతకాపు, కొమ్ముల జంగమయ్య, తుండూరు బుజ్జి, కొమ్ముల కొండలరావు, మద్దా చంటి, వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.