ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మహంతి పేటలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి ఆదివారం రాత్రి గడపగడపకి జనసేన కార్యక్రమంలో భాగంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన తమ్కఉ రోడ్డు వేయలేదన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళాలన్నా ఆటో కార్మికులు ఆ రోడ్లలో వెళ్ళడానికి భయపడి రావడం లేదన్నారు. రాత్రి వేళలో ట్యూషన్ నుంచి రావాలంటే కనీసం వీధి దీపాలు కూడా లేవని చాలా భయానక స్థితిలో బ్రతుకుతున్నామని వాపోయారు. ఒక్క నాయకుడు కూడా తమ ఊరు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పారు. లోకం మాదవి మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పైల శంకర్, రామ్ లక్ష్మణ్, శ్రీనివాస్ మురళి, సీతం నాయుడు, శ్రీను, లక్ష్మణ్, శివ సంతోష్, ఈశ్వరరావు, పైడిరాజు, శ్రీను, సురేష్, రాజ్ కుమార్, వీర మహిళలు మాధవి, రాజేశ్వరి, జమయ, స్వాతి, నిఖిత పాల్గొన్నారు.