బాబుతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

ప్రజాశక్తి-బొండపల్లి  :  చంద్రబాబు అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎం.కొత్తవలస, కొవ్వాడపేట గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి బండారు బాలాజీ, వేమలి చైతన్యబాబు, డి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.వేపాడ : మండలంలోని బల్లంకి గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యాన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఇంటింటికీ వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి మినీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, ఎంపిటిసి గొంప తులసి, నాయకులు గుమ్మడి రాంబాబు, నాగల సౌరి, సూర్యం, దేవుడు, తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట : మండలంలోని తిమిడి గ్రామంలో శుక్రవారం బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షులు జి.ఎస్‌.నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటింటికి వెళ్లి పంపణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి యూనిట్‌ ఇన్‌ఛార్జి రాయవరపు రవి శంకర్‌, బూత్‌ కన్వీనర్లు వర్రి రాజు, కర్రి జోగారావు, బోనంగి జ్యోతి, తిమిడి ఉప సర్పంచ్‌ బర్ల స్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల : వల్లూరు పంచాయతీ పెద తరిమి గ్రామంలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు సువ్వాడ రవిశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్యారంటీ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంచాది జగన్నాథం, ఎం.శ్రీను, లెంక సూర్యారావు పాల్గొన్నారు.గుర్ల : బాబుతో రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు తెలిపారు. శుక్రవారం పల్లిగండ్రేడులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐటిడిపి నాయకులు నాగుల పల్లి నారాయణ రావు, బూత్‌ కన్వీనర్‌ మజ్జి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.చంద్రబాబుతోనే దళితులకు రక్షణ విజయనగరం కోట : రాష్ట్రంలో దళితులను ఊచకోత చేస్తుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని టిడిపి రాష్ట్ర ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎంఎస్‌ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులపై చేస్తున్న దమనకాండకు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన ‘దళిత శంఖారావం’ కార్యక్రమం మెసానిక్‌ టెంపుల్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన ఆర్థిక ఉగ్రవాది సామాజిక సాధికారత బస్సుయాత్రపై పూలే, అంబేద్కర్‌, కొమరం భీమ్‌ ఫోటోలు పెట్టుకొని తిరగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాల, మాదిగ, రెల్లి, బిసిలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ఎవరి హయాంలో సామాజిక న్యాయం ఉందో చర్చకు సిద్ధమని అన్నారు. ప్రభుత్వ పదవుల్లో ఒక్క సలహాదారుడైన ఎస్‌సిల నుంచి ఉన్నారా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో దళిత నాయకులను స్పీకర్‌ చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ వచ్చిన తర్వాత ఆ సిఫారసులు అమలు చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని గ్యారెంటీ ఉంటుందని అన్నారు. రానున్న జనవరి 10వ తేదీన లక్ష మంది దళితులతో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కర్రోతు బంగార్రాజు, బోనెల విజయచంద్ర, ఎస్‌సి సెల్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️