ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు

Nov 29,2023 21:29
ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు

ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఓటు తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫారం -7 అందించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తప్పవని కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ ఎస్‌ ఆర్‌ -2024 పై చేపడుతున్న చర్యలు జిల్లా కలెక్టర్‌ వివరించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫారమ్‌ -7 క్షేత్ర స్థాయి పరిశీలనలో తప్పుగా తేలిన వాటిని సంబంధిత ఆర్‌. ఓ. లు వెంటనే పోలిస్‌ శాఖకు అప్పగించాలని సూచించారు. అన్నిరకాల దరఖాస్తులు 3,52,198 అందాయని, 7,425 పరిశీలించాల్సి వుందని పైనల్‌ రోల్‌ ప్రకటన సమయానికి పూర్తిచేస్తామని సూచించారు. డిసెంబర్‌ 1 నుండి ఇవిఎం లపై అవగాహన కల్పించడానికి మొబైల్‌ వాహనాలు నియోజకవర్గాలలో పర్యటించ నున్నాయని తెలిపారు. సమావేశంలో బిజెపి పురుషోత్తం నాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు, వై ఎస్‌ ఆర్‌ సి పి చంద్రమౌళి, డిప్యూటి కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్దిఒ లు శివశంకర్‌ రెడ్డి, చంద్రముని, తహసిల్దార్‌ లు శిరీష , సుబ్రహ్మణ్యం , ఎన్నికల సెక్షన్‌ లక్ష్మీపతి, పవన్‌ పాల్గొన్నారు.రైటప్‌ : రాజకీయ నాయకులతో కలెక్టర్‌ సమావేశం

➡️