ప్రజాశక్తి-విజయనగరం : 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు ఎస్.కోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బోజంకి భరత్ రూపొందించిన టీ కాఫీ శాండ్ ప్రాజెక్టు ఎంపికైంది. గుంటూరులోని కెఎల్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో 187 ప్రాజెక్టులు ప్రదర్శించగా భరత్ రూపొందించిన టీ కాఫీ శాండ్ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు డిఇఒ బి. లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. గైడ్ టీచరుగా పొట్నూరు శివాజీ వ్యవహరించారు. ఈ విద్యార్థిని ఆప్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ అపర్ణ ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ బి. ప్రతాపరెడ్డి, డిఇఒ బి. లింగేశ్వర్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఎం.కృష్ణారావు , జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ టి.రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మహేశ్వరరావు అభినందించారు .