ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షుడు గొంప వెంకటరావు అధ్యక్షతన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పాల్గొని ముందు వేణుగోపాలస్వామి ఆలయంలోనూ, సత్యసాయి బాబా ఆలయంలోనూ పూజలు నిర్వహించుకుని గ్రామంలో ఇంటంటికి తిరిగి మిని మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించడానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజవర్గం అధ్యక్షురాలు గుమ్మడి భారతి, నాయకులు జనపరెడ్డి ఈశ్వరరావు, ముక్క రామకృష్ణ, సిరికి రమణ, గుర్రుపోటి రమణ, సేనాపతి గణేష్, మంచిని అప్పలసూరి, గొర్లె నాగరాజు, చామలాపల్లి, కరకవలస, వీలుపరితి, కెఆర్ పేట, ఎస్ కోట, ఎల్ కోట, కొత్తవలస, జామి మండలాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గానికి చెందిన జగ్గయ్యపేట టిడిపి నాయకులు గొంప కృష్ణ నేతృత్వంలో పనిచేస్తామని ఆయన సమక్షంలో పార్టీ కండువాలు వేసుకున్నారు. బొడ్డపేటలో భవిష్యత్తుక గ్యారెంటీనెల్లిమర్ల: మండలంలోని బొడ్డపేటలో ఆదివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్ సమన్వయకర్త, ఇచ్చాపురం నియోజకవర్గం పరిశీలుకులు సువ్వాడ రవిశేఖర్ ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం పంట పొలాల్లో తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ బాండ్లను పంపిణీ చేశారు. పంట పొలాల్లో తిరిగి లిభవిష్యత్ గ్యారెంటీ బాండ్లులి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సువ్వాడ రవి శేఖర్ మాట్లాడుతూ చంద్రబాబును గెలిపిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి మొంగం శ్రీనివాసరావు, వల్లూరు నాయకులు పంచాది జగన్నాథం, వైస్ ప్రెసిడెంట్ తలచుట్ల మహాలక్ష్మి నాయుడు, బూత్ ఇంచార్జ్ పాలవలస పాపినాయుడు, రాము నాయుడు, పున్నాన రమణ, పెంటయ్య, గ్రామ నాయకులు పాల్గొన్నారు.