కుంపల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ

ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని కుంపల్లిలో ఆదివారం రాత్రి టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను వివరించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మహాశక్తి, తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ. 15 ఇస్తారన్నారు. దీపం పేరుతో ప్రతి ఇంటికీ సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని అన్నదాతకు ఏటా రూ. 20వేలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గం టిడిపి మహిళ అధ్యక్షరాలు గుమ్మడి భారతి, మండల టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు ఎం రామకృష్ణ, ఉపాధ్యక్షుడు సిరికి రమణ, మాజీ సర్పంచ్‌ మంచిని అప్పుల సూరి, కొట్టానా అర్జునరావు, నరిసిపల్లి వెంకటరమణ, కుం పల్లి చెప్పదేముడు, బక్క నాయుడుపేట గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️