కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Nov 30,2023 15:01 #ananthapuram

ప్రజాశక్తి-కదిరిటౌన్‌(అనంతపురం) : కదిరి పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను ఆటోలో తరలించారు. ఈ ఘటనపై బాలికలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం భోజనం సమయంలో ఉపాధ్యాయులు, తొమ్మిదో తరగతి విద్యార్థినులను పాఠశాల ఆవరణంలో పరిసరాలు శుభ్రం చేయిస్తుండగా ఒక్కసారిగా చర్మ సంబంధిత వ్యాధి దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌ సౌకడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు లోనైనట్లు తెలిపారు. దీంతో హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను ఆటోలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాబ్జాన్‌ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆస్వస్థత గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందజేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నాడు నేడు పనులు ద్వారా కార్పొరేట్‌ స్థాయి ప్రమాణాలతో మెరుగైన వసతులతో తీర్చిదిద్దుతున్నామని ప్రగల్బల్‌ పలుకుతున్నారే.. తప్ప ఆచరణలో సాధ్యం కాలేదని విమర్శించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డాక్టర్లు విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

➡️