ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు

Dec 1,2023 21:56

 ప్రజాశక్తి-వేపాడ   :  జనవరి 31లోగా జగనన్న ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు చేస్తామని ఎంపిపి డి.సత్య వంతుడు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో హౌసింగ్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తిచేసే బాధ్యతను సచివాలయ సిబ్బంది తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ పట్నాయక్‌, తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌ ఇఒపిఆర్‌డి ఉమ, పిఆర్‌ జెఇ ఆలీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ వి.దేవి పాల్గొన్నారు.అధికారులతో సమావేశం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి లకీëనారాయణ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో ఎంపిడిఒ పట్నాయక్‌, తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.గృహ నిర్మాణాలు వేగవంతంరామభద్రపురం : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో, లేఅవుట్లలో ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. మండలానికి మంజూరైన సుమారు 450 ఇళ్లను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సమస్యలుంటే రెవెన్యూ, మండల పరిషత్తు, వైకెపి సమన్వయంతో పనిచేసి గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపిడిఒ రమామణి, హౌసింగ్‌ ఎఇ సింహాచలం నాయుడు, ఇఒపిఆర్‌డి వెంకటరమణ, ఎపిఎం రత్నాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️