ప్రజాశక్తి – నెల్లిమర్ల : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్‌వాడీలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబరు 8 నుండి నిరవదిక సమ్మె చేస్తున్నారని ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యుఎస్ రవి కుమార్, విజయనగరం నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో జరుగుతున్న సెక్టార్ మీటింగ్స్‌లో భాగంగా కొండవెలగాడ, నెల్లిమర్ల, సారిపల్లి, సతివాడల్లో వెళ్లి అంగన్ వాడిలకు పోరాట కార్యాక్రమాన్ని తెలిపారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్‌లను పర్మినెంట్ చేయాలని, పింఛన్లు ఇవ్వాలనీ, తెలంగాణ రాష్ట్రం కన్న వెయ్యి రూపాయల వరకూ ఎక్కువ జీతం ఇస్తామన్న జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిల బెట్టు కొవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు పార్వతి, మంగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.గజపతినగరం: డిసెంబర్ 8 నుండి కనీస వేతనాలు రూ.26 వేలు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కన్నా ఇచ్చిన హామీ ప్రకారం అదనపు జీతం ఇవ్వాలని, గ్రాడ్యుటి పెన్షన్, ఎక్స్‌గ్రేషియా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న సమ్మెను జయప్రదం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి కోరారు. బొండపల్లి మండల కేంద్రం వద్ద అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కరపత్రాలను విడు దల చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనగా సెంటర్‌కు హాజరై డ్యూటీలు చేస్తామ న్నారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబే ద్కర్ విగ్రహానికి వినతులు సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కుమారి, హైమ, శాంతి పాల్గొన్నారు.దత్తిరాజేరు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 8వ తేదీ నుండి అంగన్వాడీల నిరవదిక సమ్మెకు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు. మండలంలోని పెదమానాపురం బీసీ కాలనీలో మంగళవారం పలువురు అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ పి జ్యోతి, సెక్టార్ లీడర్లు కే వాణి, జి ముత్యాలమ్మ, ఆర్ రేణుక, భారతి, పలువురు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.