విజయనగరం

  • Home
  • ప్రజాశక్తి-విలేకర్లుఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు అక్కడక్కడా పండిన వరిచేలను కోత కోసే సమయంలో పడుతున్న స్వల్ప వర్షాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. పొలాల్లో ఉన్న వరిచేలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. వంగర : మండలంలో కురిసిన స్వల్ప వర్షంతో పొలాల్లో కోసి ఉన్న వరిచేలు తడిచిపోయాయి. ఈ ఏడాది వర్షా బావ పరిస్థితుల వల్ల ఎన్నో అప్పులు చేసి పొలంలో కష్టపడి వరి పంటను కొంతమేరైనా రక్షించుకోవాలని ఉద్దేశంతో చివరి దశలో మోటార్లతో నీరు తోడి కాపాడుకున్నప్పటికీ మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలలో రైతులు తమ తమ పంటలను కోత కోసి పొలాలలోనే ఓవులుగా వేసి ఉంచారు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆందోళన చెందుతున్నారు. మెంటాడ : మండలంలో ఆకాల వర్షాల వల్ల వరి రైతులకు నష్టం వాటిల్లింది. గతమూడు రోజులుగా రైతులు వరి కోతలు మొదలుపెట్టారు. ఈ దశలో వర్షం పడడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఉరుకులు పరుగులతో పొలాల్లోనే గాలి దిబ్బలు పెట్టారు. వాటిని కప్పి ఉంచేందుకు టార్పాలిన్లు కోసం పరుగులు తీశారు. లక్కవరపుకోట : మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కోసిన వరి చేను తడిసింది. వరి చేను పండేందుకు అవసరమైన సమయంలో వర్షాలు పడకపోయినా చెరువులు, బోరు బావులు నుండి నీరునుతోడి అతి కష్టాల మీద రైతులు వరిని పండించారు. తీరా చేతికి అందించిన వరి పంటను కోతలు కోయడంతో వర్షానికి తడిసి ముద్దయింది. చేతికి అందోచ్చిన పంట వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా 9605 ఎకరాలు సాధారణ విస్తీర్ణ ఉండగా ఈ ఏడాది 9176 ఎకరాలలో వరి పంట వేశారు. వాటిలో సుమారు 510 ఎకరాలలో పండిన వరి పంటను కోశారు. కోసిన పంటను కొన్ని ప్రాంతాలలో కుప్పలు పెట్టుకోగా మరికొన్ని చోట్ల పొలాల్లో ఆరబెట్టారు. ఆరబెట్టిన వరిచేను మాత్రమే ఉదయం నుంచి కురుస్తున్న జల్లులకు తడిచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని స్వాతి వెల్లడించారు. కోసిన పంట 4 రోజుల వరకు ఆరబెట్టకుండా కుప్పలు వేయకూడదని రైతులకు సూచించారు. కురిసిన జల్లులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు.రేగిడి : వర్షానికి పలు గ్రామాల్లో వరి చేలు తడిసి ముద్దయ్యాయి. మండలంలో 12,662 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 3వేల ఎకరాలలో కోసిన వరిచేలు వర్షాలకు తడిశాయనివ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. రంగు మారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో తక్షణమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

విజయనగరం

ప్రజాశక్తి-విలేకర్లుఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు అక్కడక్కడా పండిన వరిచేలను కోత కోసే సమయంలో పడుతున్న స్వల్ప వర్షాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. పొలాల్లో ఉన్న వరిచేలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. వంగర : మండలంలో కురిసిన స్వల్ప వర్షంతో పొలాల్లో కోసి ఉన్న వరిచేలు తడిచిపోయాయి. ఈ ఏడాది వర్షా బావ పరిస్థితుల వల్ల ఎన్నో అప్పులు చేసి పొలంలో కష్టపడి వరి పంటను కొంతమేరైనా రక్షించుకోవాలని ఉద్దేశంతో చివరి దశలో మోటార్లతో నీరు తోడి కాపాడుకున్నప్పటికీ మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలలో రైతులు తమ తమ పంటలను కోత కోసి పొలాలలోనే ఓవులుగా వేసి ఉంచారు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆందోళన చెందుతున్నారు. మెంటాడ : మండలంలో ఆకాల వర్షాల వల్ల వరి రైతులకు నష్టం వాటిల్లింది. గతమూడు రోజులుగా రైతులు వరి కోతలు మొదలుపెట్టారు. ఈ దశలో వర్షం పడడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఉరుకులు పరుగులతో పొలాల్లోనే గాలి దిబ్బలు పెట్టారు. వాటిని కప్పి ఉంచేందుకు టార్పాలిన్లు కోసం పరుగులు తీశారు. లక్కవరపుకోట : మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కోసిన వరి చేను తడిసింది. వరి చేను పండేందుకు అవసరమైన సమయంలో వర్షాలు పడకపోయినా చెరువులు, బోరు బావులు నుండి నీరునుతోడి అతి కష్టాల మీద రైతులు వరిని పండించారు. తీరా చేతికి అందించిన వరి పంటను కోతలు కోయడంతో వర్షానికి తడిసి ముద్దయింది. చేతికి అందోచ్చిన పంట వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా 9605 ఎకరాలు సాధారణ విస్తీర్ణ ఉండగా ఈ ఏడాది 9176 ఎకరాలలో వరి పంట వేశారు. వాటిలో సుమారు 510 ఎకరాలలో పండిన వరి పంటను కోశారు. కోసిన పంటను కొన్ని ప్రాంతాలలో కుప్పలు పెట్టుకోగా మరికొన్ని చోట్ల పొలాల్లో ఆరబెట్టారు. ఆరబెట్టిన వరిచేను మాత్రమే ఉదయం నుంచి కురుస్తున్న జల్లులకు తడిచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని స్వాతి వెల్లడించారు. కోసిన పంట 4 రోజుల వరకు ఆరబెట్టకుండా కుప్పలు వేయకూడదని రైతులకు సూచించారు. కురిసిన జల్లులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు.రేగిడి : వర్షానికి పలు గ్రామాల్లో వరి చేలు తడిసి ముద్దయ్యాయి. మండలంలో 12,662 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 3వేల ఎకరాలలో కోసిన వరిచేలు వర్షాలకు తడిశాయనివ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. రంగు మారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో తక్షణమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Nov 23,2023 | 16:36

ప్రజాశక్తి-విలేకర్లుఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు అక్కడక్కడా పండిన వరిచేలను కోత…

డిసెంబర్‌ 17,18 ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

Nov 23,2023 | 15:29

వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిసెంబర్‌ 17,18 తేదీల్లో నెల్లిమర్లలో ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు జరగనున్నాయి అని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు సి…

జామిలో పంటకోత ప్రయోగాలు

Nov 22,2023 | 21:44

ప్రజాశక్తి-జామి : జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో జామి మండలం జాగారం గ్రామంలో వరి పొలాల్లో బుధవారం పంటకోత ప్రయోగాలు నిర్వహించారు. ప్లాటులో సుమారు 18.680…

విద్యారంగ పరిరక్షణే లక్ష్యం

Nov 22,2023 | 21:42

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా యుటిఎఫ్‌ పోరాటాలు సాగిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి తెలిపారు. బుధవారం యుటిఎఫ్‌ బొబ్బిలి మండలం నూతన…

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

Nov 22,2023 | 21:40

ప్రజాశక్తి-వేపాడ : జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. వేపాడ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ…

సిసి రోడ్డుకు శంకుస్థాపన

Nov 22,2023 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న…

25 నుంచి ఇంటింటికీ బిఎల్‌ఒలు

Nov 22,2023 | 21:34

ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 5 వరకు బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి మరోసారి తనిఖీ చేయాలని కలెక్టర్‌…

ఎవరీ అజ్ఞాతవాసి?

Nov 22,2023 | 21:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/భోగాపురం : ఆమె అధికారి కాదు… ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు… ఎన్‌జిఒనా అని ప్రశ్నిస్తే అబ్బబ్బే కాదంటూ ఖండించారు. అధికారులు కూడా తమకు…

హాకీ జాతీయస్థాయి పోటీలకు ఫోర్టసిటీ పాఠశాల విద్యార్థి

Nov 22,2023 | 17:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ అనకాపల్లి దగ్గరలో వున్న నక్కపల్లెలో నాలుగు రోజుల పాటు నిర్వహించే హాకీ స్టేట్ మీట్ ఫోర్ట్…