దిగుమతికి త్వరలో కేంద్రంతో ఒప్పందం
న్యూఢిల్లీ : లగ్జరీ విద్యుత్ కార్ల తయారీదారు టెస్లా కంపెనీ వచ్చే ఏడాది నుంచి భారత్‌లో తమ వాహనాలను విక్రయించడానికి మార్గం సుగమం చేసుకుంటుందని సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా ఒప్పందం కుదుర్చుకోవడానికి తుది చర్చలు జరుపుతుంది. త్వరలోనే కేంద్రం, టెస్లా మధ్య ఒప్పందం జరుగొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల దిగుమతికి కేంద్రం అంగీకరించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రెండేళ్లలో ఇక్కడ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి గడువు ఇస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. తొలుత ఇక్కడ తయారు చేస్తే తప్పా అమ్మకాలకు అవకాశం కల్పించేది లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… తుదకు టెస్లా తలగ్గి షరతులను ఎత్తివేసినట్లు అయ్యింది.