న్యూఢిల్లీ : రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బిఐ ప్రకటన చేసి ఆరు నెలలు అవుతోన్న ఇంకా ఆ కరెన్సీకి చెందిన వేల కోట్లు బ్యాంక్‌లకు చేరలేదు. నవంబర్ 30 నాటికి రూ.2,000 నోట్లలో 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయ్యాయని ఆర్‌బిఐ వెల్లడించింది. మిగితా 2.7 శాతం లేదా రూ.9,760 కోట్లు విలువ చేసే రూ.2వేల నోట్లు చెలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ పెద్ద నోట్లను అక్టోబర్ 7నుంచి బ్యాంక్‌ల్లో డిపాజిట్‌కు, మార్పిడికి అవకాశాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం ఆర్‌బిఐ రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే మార్చుకోవడానికి వీలుంది.