తగ్గిన విమానయాన ఇంధన ధర – పెరిగిన గ్యాస్‌ ధర

Dec 1,2023 21:07 #Business

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విమానయాన ఇంధన ధరలను తగ్గించి.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ధనవంతులు ఎక్కువగా ప్రయాణించే విమానాలకు సంబంధించిన ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఎటిఎఫ్‌) ధరలను ఒక్కో కిలోలీటర్‌పై రూ.5,189.25 తగ్గించి రూ.1,06,155.67కు చేర్చింది. దీంతో ఈ నెలలో వరుసగా రెండో సారి ఎటిఎఫ్‌ ధరలకు కోత పెట్టినట్లయ్యింది. మరోవైపు వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచింది. 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.21 ధర పెంచింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలీండర్‌ ధర రూ.1,796.50కు చేరింది. మరోవైపు గడిచిన 21 నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

➡️