ముంబయి : క్రెడిట్ కార్డులను ఇబ్బడిమబ్బడిగా వాడేస్తున్నారు. ఆర్‌బిఐ గణంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల వ్యయాలు చేశారు. ఒక్క నెలలోనే ఈ స్థాయిలో వినియోగించడం ఇదే రికార్డ్. ఇంతక్రితం సెప్టెంబర్‌లో రూ.1.42 లక్షల కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. పండగ సీజన్ కావడంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో భారీగా కొనుగోళ్లు జరగడంతో ఈ వృద్థి చోటు చేసుకుంది. గడిచిన అక్టోబర్‌లో పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఒఎస్) లావాదేవీలు రూ.57,774కోట్లకు, ఇ-కామర్స్ చెల్లింపులు రూ.1,20,794 కోట్లకు పెరిగాయి.