మార్చి కల్లా 2500 శాఖలకు విస్తరణ

Nov 25,2023 21:30 #Business

పూణె : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) 2024 మార్చి ముగింపు నాటికి 2500 శాఖలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ బ్యాంక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ రాజీవ్‌ తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో కొత్తగా 650 శాఖలను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 250 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారంలో 23-25 శాతం వృద్థిని సాధించాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్ల నికర లాభాలు అంచనా వేస్తున్నామన్నారు.

➡️