ఇడి నోటీసులు జారీ
న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి రూ.9000 కోట్లు విదేశాలకు తరలించినట్లు ప్రధాన అరోపణ. 2011 నుంచి 2023 మధ్య కాలంలో రూ.28వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుందని మీడియా రిపోర్టులు వస్తున్నాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకు రూ.9,754 కోట్లను బైజూస్ తరలించింది. నిధుల తరలింపులో బైజూస్ వ్యవస్థాపకులు ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అరోపణలు వస్తున్నాయి. కాగా ఈ రిపోర్టులను బైజూస్ ఖండించింది. ఈ అంశమై తమకు ఎలాంటి ఇడి నోటీసులు అందలేదని తెలిపింది.