చెన్నయ్ : ఆరోగ్య సంరక్షణలో మరో కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు అపోలో క్యాన్సర్ సెంటర్ పేర్కొంది. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దక్షిణాసియాలో తొలిసారి చెన్నరులో తొలి సైబర్‌నైఫ్ ఎస్7 ఎఫ్‌ఐఎం రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్‌ని పరిచయం చేసినట్లు ప్రకటించింది. ఇది క్యాన్సర్, క్యాన్సర్ కాని కణితులకు ఖచ్చితమైన చికిత్సా విధానం అందుతుందని రేడియేషన్ అంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహదేవ్ పోతరాజు పేర్కొన్నారు. దీంతో చికిత్స సెషన్‌లు నాన్ ఇన్వాసివ్ ఔట్ పేషెంట్ విధానాలు, అనస్తీషియా, కోతల అవసరం ఉండదన్నారు.