న్యూఢిల్లీ : భారత్‌ా మలేసియా మధ్య భారీగా విమానయాన సేవలను పెంచుతున్నట్లు ఏయిర్ ఆసియా వెల్లడించింది. వచ్చే ఏడాది 2024లో మొదటి 3 నెలల్లో వారానికి 69 విమానాలను తిప్పనున్నట్లు తెలిపింది. ఏడాదికి 15 లక్షల సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ ఒక్కటో తేది నుంచి భారత్ నుంచి మలేషియాలోకి వచ్చే ప్రయాణికులకు 30 రోజుల వీసా-రహిత ప్రవేశాన్ని మలేషియా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రయాణికులపై దృష్టి పెట్టింది.