రూ.1 లక్ష కోట్లు పెరిగిన అదాని స్టాక్స్‌ విలువ

Nov 28,2023 21:10 #Business

ముంబయి : అదాని గ్రూపు కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదాని సంస్థలపై వచ్చిన ఆర్థిక ఆరోపణల విచారణలో సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణం కనడడటం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడంతో మంగళవారం ఆ కంపెనీల స్టాక్స్‌ భారీగా పెరిగాయి. అదానికి చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీల స్టాక్స్‌ విలువ ఒక్క పూటలోనే రూ.1.05 లక్ష కోట్ల మేర పెరిగి రూ.11..31 లక్షల కోట్లకు చేరింది. గడిచిన ఏడాదిన్నరలో ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. కాగా.. భారత స్టాక్‌ మార్కెట్లకు రెండు రోజుల వరుస నష్టాల నుంచి ఉపశమనం లభించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 204 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 66,174 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 95 పాయింట్ల వృద్థితో 19,890 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 0.30 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.06 శాతం చొప్పున రాణించాయి.

➡️