న్యూఢిల్లీ : విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఇాస్ప్రింటో ఆవిష్కరించిన రాపో, రోమి మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 నవంబర్ 21న వీటిని అధికారికంగా ఆవిష్కరించింది. తాజాగా వీటిని విక్రయానికి అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ బుధవారం వెల్లడించింది. రపో ధరను రూ.54,999గా, రోమి ధరను రూ.62,999గా నిర్ణయించింది. కాలేజీ విద్యార్థులు, గిగ్ వర్కర్స్, పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. వీటిని ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని ఇాస్ప్రింటో కో ఫౌండర్ అతుల్ గుప్తా తెలిపారు.