న్యూఢిల్లీ : ప్రముఖ నగదు చెల్లింపుల వేదిక గూగుల్ పేలో ఇకపై మొబైల్ ఫోన్ రీఛార్జ్‌లపై ఫీజును వసూలు చేయనుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇటీవల ఓ వినియోగదారుడు రూ.740 ప్లాన్‌ను రీఛార్జ్ చేయగా.. రూ.3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేయగా.. తను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతానికి కొందరు వినియోగదారుల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా.. భవిష్యత్‌లో యూజర్లందరీ నుంచి ఈ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై గూగుల్‌పే అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఫోన్ పే, పేటియం వేదికలు కన్వీనెన్స్ ఫీజును వసూలు చేస్తున్నాయి.