న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 98.14 శాతం క్లెయింలను సెటిల్మెంట్ చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్ వెల్లడించింది. ప్రయివేటు రంగ జీవిత బీమా సంస్థలలో క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిలో తమ సంస్థనే అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. 2023 జూన్ త్రైమాసికంలో 97.9 శాతం క్లెయిమ్‌లను సెటిల్మెంట్ చేసినట్లు తెలిపింది. ఖాతాదారులు, వారి కుటుంబాలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో సంస్థ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంది.