మరింత సమర్థవంతంగా బయోఫ్యాక్టర్ ‘బెలోమ్’
సిఇఒ ఎల్‌ఎన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : జీవ ఎరువులు, ప్రాణాధార పోషకాల తయారీ కంపెనీ బయోఫ్యాక్టర్ పరిశోధనలో మరో ముందడుగు వేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్త అనావృష్టి, అతివృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడి కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసే ”బెలోమ్”ను ఆవిష్కరించినట్లు తెలిపింది. దీని ఫోలియర్ న్యూట్రిమేషన్ సాంకేతికతకు మరింత సామర్థ్యాన్ని జోడించినట్లు వెల్లడించింది. ప్రపంచంలో తొలిసారిగా మెటబోలైట్ అసిస్టెడ్ మైక్రాన్ సైజ్డ్ (ఎంఎఎంఎస్) న్యూట్రిమేషన్ తయారు చేసి ఇప్పటికే విజయవంతంగా విక్రయిస్తోన్నామని బయోఫ్యాక్టర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న బయోఫ్యాక్ ఇన్‌పుట్స్ ఫౌండర్, సిఇఒ ఎల్‌ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆధునీకరించిన బెలోమ్ ఉత్పాదనపై దేశవ్యాప్తంగా సాగించిన పరిశోధనలలో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. మొక్కకు కావలసిన 13 రకాలైన ప్రాణాధార పోషకాలు ఎంఎఎంఎస్ విధానంలో ప్రత్యేకించి తయారు చేశామని తెలిపారు. ‘బెలోమ్’ ఉత్పాదనను ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షకు పైచిలుకు రైతులు వినియోగిస్తున్నారని ఎల్‌ఎన్ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వివిధ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజన్న, టమాట, వంకాయలు, బంతి, మిర్చి, పత్తి వంటి పంటలపై పరిశోధనలు జరిపామని చెప్పారు.హొ650 మంది ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా 3,500 పైచిలుకు డీలర్ నెట్‌వర్క్ ఉంది. బయోఫ్యాక్టర్ పరిశోధన, అభివఅద్ధి విభాగం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండిస్టియల్ రిసర్చ్‌కు (డిఎస్‌ఐఆర్) నుంచి ధృవీకరణ ఉందన్నారు. తమకు ప్రోబయాటిక్స్ విభాగంలో 35 ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్‌తోపాటు నానో టెక్నాలజీలో ఎనిమిది పేటెంట్లను సొంతం చేసుకున్నామన్నారు.