ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్ : తమది రైతుల మేలు కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని పక్కి, దిబ్బగుడ్డివలస, గోపాలరాయుడుపేట గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పనిలేకుండా సొంతూరిలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మి, వేణుగోపాలనాయుడు, జెడ్పిటిసి సంకిలి శాంతకుమారి, సర్పంచ్ గంట పైడిరాజు, ఉప సర్పంచ్ అల్లు రామూర్తి, కొరటం సర్పంచ్ చీకటి శ్రీకాంత్, పాములవలస సర్పంచ్ చప్ప ఈశ్వరరావు, సుందరాడ సర్పంచ్ అద్దంకి దిలీప్ కుమార్ పాల్గొన్నారు.