ముంబయి: పాకిస్తాన్‌తో ఫిబ్రవరిలో జరిగే డేవిడ్ కప్ ప్రపంచకప్ గ్రూప్-1 ప్లాేఆఫ్లో తలపడేందుకు సుమిత్ నాగల్, శశి ముకుంద్ వెళ్లనున్నారు. ఆలిండియా టెన్నిస్ సమాఖ్య(ఎఐఐటి) శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్లైన సుమిత్ నాగల్(141వ ర్యాంక్), శశి ముకుంద్(477వ ర్యాంక్)లలో బరిలోకి దిగనున్నట్లు ఎఐఐటి ఆ ప్రకటనలో పేర్కొంది. తొలి లీగ్‌లో నెగ్గిన భారత్ డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1 ప్లాేఆఫ్లో ఆడేందుకు పాకిస్తాన్‌కు పయనం కానుంది. రోహన్ బప్పన్న అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పడంతో రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్‌లో మరో ప్లేయర్‌తో కలిసి బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఇక పాకిస్తాన్ నుంచి సింగిల్స్‌లో అఖీల్ ఖాన్, ఖురేషీ ఆడనున్నట్లు సమాచారం.