పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

 ప్రజాశక్తి-విజయనగరం  :  బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన యాళ్ల గణపతి(29)కి ప్రత్యేక పోక్సో న్యాయ స్థానం 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. ఈమేరకు శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్ల పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. అప్పటి దిశ మహిళా పిఎస్‌ డిఎస్‌పి ఎం.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలోఅభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసును ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చి, 9మాసాల్లోనే ప్రాసిక్యూషన్‌ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు స్పెషల్‌ జడ్జి కె.నాగమణి నిందితుడికి 45ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

➡️