అమరావతి: ఏపీలో ఎస్ఐ నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 45వేల మంది యువత భవిష్యత్తు దఅష్ట్యా స్టే ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు ఎత్తు కొలతల ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీని కోర్టుకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హైకోర్టు నియమించే బఅందం సమక్షంలో అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలుస్తామని న్యాయమూర్తి తెలిపారు. అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేసినట్టు నిరూపితమైతే ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నెల 29న ఎంతమంది హాజరవుతారో తెలపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.