రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని,తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలనీ,రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8 నుంచి తలపెట్టిన సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్ పి అర్ భవనంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం, జనసేన, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ, సిఐటియు, ఐద్వా, శ్రామిక మహిళా సంఘం, ఎస్ ఎఫ్ ఐ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. పోరాటానికి అండగా ఉంటామన్నారు.అనంతరం ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.పాల్గొన్న రాజకీయ పార్టీలు నాయకులు,ప్రజా సంఘాలు నాయకులు ఆమోదించారు.