ప్రజాశక్తి – బాపట్ల
జిబిసి రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్‌పై ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు స్థానచలనం కలుగుతోంది. పట్టణంలోని అంబేద్కర్ బొమ్మకు దగ్గర్లో డివైడర్‌పై ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి పట్టణంలో మరింత ఆకర్షణీయమైన ప్రాంతంలో ప్రతిష్టిస్తామని ఆర్యవైశ్య సంఘం నాయకులకు ఎంఎల్‌ఎ కోన రఘుపతి హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించే ప్రక్రియను చేపట్టారు. అక్కడ నుండి తొలగించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గడియార స్తంభం, పోస్ట్ ఆఫీస్ భవనం మధ్య ప్రతిష్టించేందుకు ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి గురువారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తమాసు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కోళ్ళపూడి సురేష్, ఉపాధ్యక్షులు బూర్లె అనిల్, మామిడి రమేష్ కుమార్, వెంకట రత్న గుప్త, బోగ్గవరపు వెంకటేశ్వర్లు, పుల్లయ్య గుప్త, వేణు, మని సాయి కృష్ణ, తడవర్తి నారాయణ, తాళ్లూరి శ్రీను, రాము, భాస్కర ప్రసాద్ పాల్గొన్నారు.