ఉపాధి పనుల వద్ద కూలీలతో మాట్లాడుతున్న రాష్ట్ర పిఆర్ కమిషనర్ రాజశేఖర్
లేపాక్షి : మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో జరుతున్న ఉపాధి హామీ పనులను గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రాజశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గొంగిటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. సకాలంలో కూలి డబ్బులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రోజుకు ఎంత కూలి పడాలని ప్రశ్నించగా రూ. 275 రావాలి కానీ రూ. 256ర వస్తుందని తెలిపారు. మండలంలో 8,339మంది కూలీలు ఉండగా కేవలం 508 మంది మాత్రమే పని చేయడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు అనుకూలంగా ఉపాధి పనులు చేయాలన్నారు. ఆయన వెంట ఇఒఆర్‌డి శివన్న, ఎపిఒ జ్యోతి, సెక్రటరీ ప్రకాష్, ఎపిఎం జయచంద్ర, సీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు.