ప్రజాశక్తి-విజయనగరం : వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా పథకం కింద జిల్లాలోని 478 మంది నవ వధువులకు రూ.2కోట్ల, 79 లక్షల 90వేలు విడుదల అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, బటన్ నొక్కినేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి లబ్దిదారులకు అందజేశారు. ఎస్‌సి, ఎస్‌సి, బిసి, వికలాంగులు, ముస్లింలు ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 మధ్య వివాహాలు చేసుకున్న వారికి, ఈ ఏడాది నాలుగో విడత ప్రోత్సాహకం అందించారు. ఎస్‌సిలకు రూ.లక్ష, ఎస్‌సి కులాంతర వివాహాలకు రూ.1.20లక్షలు, ఎస్‌టిలకు రూ.లక్ష, ఎస్‌టి కులాంతర వివాహాలకు రూ.1.2లక్షలు, బిసిలుకు రూ.50వేలు, బిసి కులాంతర వివాహాలకు రూ.75వేలు, మైనారిటీ లకు రూ.లక్ష, వికంగులకు రూ.1.5లక్షలు, వెల్ఫేర్ బోర్డులో రిజిష్టర్ చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులకు రూ.40వేలు చొప్పున వివాహ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.అర్హులందరికీ కల్యాణమస్తుజిల్లాలోని అర్హులందరికీ వైఎస్‌ఆర్ కల్యాణ మస్తు, షాదీ తోఫా వర్తిస్తుందని డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకానికి సచివాలయాల ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతీ యువకుల్లో విద్యను ప్రోత్సహించడానికి, వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన పెట్టారని చెప్పారు బాల్య వివాహాలను నివారించే ఉద్దేశంతో కనీస వయో పరిమితిని వధువుకు 18ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధన విధించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి రామానందం, గిరిజన సంక్షేమాధికారి చంద్రశేఖర్, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ రౌతు భాస్కరరావు దితరులు పాల్గొన్నారు.