ప్రజాశక్తి- డెంకాడముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసిపి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు కోరారు. జగనే రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమం మండలంలోని అమకాం గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారన్నారు. అనంతరం సంక్షేమ డిసిప్లే బోర్డును ప్రారంభించి వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డిడి స్వరూప రాణి, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, సర్పంచ్ బి అప్పారావు, ఎంపిటిసి లు, నాయకులు కోటి, ధర్మ, ఆనంద్, వినోద్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని వీలుపర్తిలో ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎంపిపి డి సత్య వంతుడు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అవినీతి రహితంగా నేరుగా ప్రజలకి అందజేస్తున్న జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల న్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ సేనాపతి లీల, ఇఒపిఆర్డి ఉమా, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, వైసిపి నాయకులు సత్యం నాయుడు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.నెల్లిమర్ల: మండలంలోని కొండవెలగాడలో సంక్షేమ పథకాల డిజిటల్ బోర్డును ఎంపిపి అంబళ్ల సుధారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు అర్హులు తెలుసుకోవడానికి డిజిటల్ బోర్డుల రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీ రాములు నాయుడు, జడ్పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి సీనియర్ నాయకులు దంతలూరి జోగి జగన్నాథ రాజు, ఎంపిడిఒ జి. రామారావు, ఇఒపిఆర్డి కె. సింహాద్రి, మండల స్థాయి అధికారులు, పాల్గొన్నారు.భోగాపురం: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని కౌలువాడ సచివాలయం పరిధిలో ఆంధ్రకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో, పథకాలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను, పథకాలు తెలిపే డిస్ ప్లే బోర్డుని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అప్పలనాయుడు, నాయకులు గాలి రాజారెడ్డి, కోరాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.