ఛండీగడ్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు హిమాచల్‌ప్రదేశ్ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్‌ాడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 47.5ఓవర్లలో 206పరుగులకే కుప్పకూలింది. నితీశ్ కుమార్‌రెడ్డి(47), మనీష్ గొలమరు(46) టాప్ స్కోరర్స్ కెప్టెన్ హనుమ విహారి(21) నిరాశపరిచాడు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు వైభవ్ అరోరా(2/23), వినయ్ గొలెటియా(3/47) బౌలింగ్‌లో మెరిసారు. హిమాచల్ ప్రదేశ్ జట్టు 43.3 ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అమిత్ కుమార్(78నాటౌట్), ఆకాశ్ వశిష్ట్(53) అర్ధసెంచరీలతో రాణించారు. అశ్విన్ హెబ్బర్, మనీశ్ గొలమర్రు, శశికాంత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. గ్రూప్‌ాబిలో హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మణిపూర్‌పై గెలిచింది. మణిపూర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 203పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు 29.5ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి గెలిచింది. హైదరాబాద్ జట్టులో రాహుల్ సింగ్(70) అర్ధసెంచరీతో మెరిసాడు.