ప్రజాశక్తి – పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి సముద్రం తీరం చూసేందుకు సుందరంగా ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి సౌకర్యాలూ కల్పించకపోవడం వల్ల స్నానానికి అనువుగా ఉండటం లేదు. ఒక్కోసారి ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది. సముద్రం ఒడ్డుంతా ఏటవాలుగా ఉండడంతో అండర్ కరెంట్ పాస్ అవుతొందని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో ఒడ్డు నుండి కొంత దూరం వెల్లగానే నీటి అడుగున రాళ్లు గుట్టలు ఉన్నాయి. వాటి ద్వారా అటుపోటులు సమయంలో కెరటాలు ఉధృతంగా మారి అండర్ కరెంట్ పాసయ్యే అవకాశం ఉన్నట్లు మెరైన్ పోలీసులు చెబుతున్నారు. దాన్ని పర్యాటకులు గుర్తించకుండా స్నానాల కోసం పది మీటర్లు లోపలకు వెల్లిపోతున్నారు. దీంతో ప్రమాదం సంబవించే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తిక మాసం సందర్బంగా చింతపల్లి తీరానికి సముద్రం స్నానం నిమిత్తం వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కొంత మంది స్నానం కోసం సముద్రం లోపలకు వెల్లి పోతున్నారు. కొంత దూరం వెల్లేంతవరకూ మెట్టుగానే అనిపిస్తున్న అడుగున రాళ్లు ఉండడంతో ఒక్కసారిగా కెరటాలు వచ్చేసరికి అండర్ కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పర్యాటకులు సముద్ర స్నానాలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తీరంలో పఠిష్ట బందోబస్ధు కార్తికమాసం దృష్టిలో పెట్టుకొని చింతపల్లి తీరంలో పఠిష్ట బందొబస్తు ఏర్పాటు చేశారు. మెరైన్ సిఐ. కె. వైకుంటరావు, ఎస్‌ఐలు శ్రీనువాస్, రమేష్‌తో పాటు ఎఎస్‌ఐ, మెరైన్ పోలీసులతో పాటు పూసపాటిరేగ లాండ్ ఆర్డర్ ఎస్‌ఐ. బాలకృష్ణ, సిబ్బదితో కలిసి పఠిష్టమైన బందోబస్ట్ ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు జరిగే సమయంలో ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలూ జరగకుండా సముద్రం నీళ్లలోనే మెరైన్ గార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. లైప్ జాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం స్ధలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చింతపల్లి తీరంలో ఉండే జట్టీపైకి ఎక్కడం నిషేదించారు. సముద్ర స్నానానికి అననుకూలంచింతపల్లి తీరంలో సముద్ర స్నానానికి అననుకూలం. సముద్రం ఒడ్డునుండి కొన్ని మీటర్లు లోపలకి వెల్లేంతవరకూ మెట్టుగా ఉన్నా అది పమాద స్ధలం. సముద్రం నీళ్ల అడుగున పదునైన రాళ్ల ఉన్నాయి. అక్కడ ఒక్కసారిగా అలలు పెరిగి అండర్ కరెంట్ పాసయ్యే అవకాశం ఉంది. అందుకే స్నానం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. – కె. వైకుంఠరావు, మెరైన్ సిఐ. చింతపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్. పూసపాటిరేగ